logo

జూనియర్‌ కళాశాల ఉత్తమ ప్రిన్సిపల్‌గా ప్రభాకర్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ప్రిన్సిపాళ్ల జాబితాలో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాలకు  చెందిన రాపోలు ప్రభాకర్‌కు చోటు దక్కింది.

Published : 04 Sep 2023 04:01 IST

రాపోలు ప్రభాకర్‌

తొర్రూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ప్రిన్సిపాళ్ల జాబితాలో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాలకు  చెందిన రాపోలు ప్రభాకర్‌కు చోటు దక్కింది. ఈయన జనగామ జిల్లా దేవరుప్పులలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. 1996లో తొర్రూరు మండలం చిట్యాలలోని ప్రభుత్వ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా చేరారు. 2001లో జేఎల్‌గా పదోన్నతి పొంది ఏడేళ్ల పాటు నెక్కొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పని చేశారు. 2008 నుంచి 2012 వరకు తొర్రూరులో, 2012 నుంచి 2017 వరకు రంగశాయిపేటలో ఎకనామిక్స్‌ అధ్యాపకుడిగా పని చేసి 2018లో ప్రిన్సిపల్‌గా పదోన్నతి పొందారు. 2018 నుంచి దేవరుప్పుల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. ఆయన కళాశాలలో చేరే నాటికి విద్యార్థుల సంఖ్య 150 ఉండగా 350కి పెరిగేలా కృషి చేశారు. గతంలో ఉత్తీర్ణత శాతం 50 ఉండగా ప్రస్తుతం 75 శాతానికి పెంచారు. దీంతో పాటు 5 ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరాలు నిర్వహించి గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పద్మశాలి పేద విద్యార్థులకు దాతల సహకారంతో ఫీజులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారు. గతేడాది మరిపెడ మండలం నిదానపురం గ్రామానికి చెందిన బూర సృజనకు నీట్‌ కోచింగ్‌ నిమిత్తం దాతల సహకారంతో రూ.50 వేల నగదు అందజేశారు. చెర్లపాలెం గ్రామానికి చెందిన జంగిచర్ల అజయ్‌కు రూ.10 వేల సాయం అందించారు.  తొర్రూరులో ఆచార్య కొండాలక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం ఏర్పాటులో చురుగ్గా పని చేశాడు. ప్రభాకర్‌ను కళాశాల అధ్యాపకులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని