logo

మోదీ పాలనతోనే దేశాభివృద్ధి

భాజపా పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ పేర్కొన్నారు.

Published : 23 Apr 2024 03:41 IST

వర్ధన్నపేటలో పార్టీలో చేరిన వారికి కండువా కప్పుతున్న అరూరి రమేశ్‌

పర్వతగిరి, న్యూస్‌టుడే: భాజపా పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ పేర్కొన్నారు. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన భారాస నాయకులు సోమవారం హనుమకొండలోని తన నివాసంలో భాజపాలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది భాజపానే అని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు  జాటోతు శ్రీనివాస్‌నాయక్‌, ఏకాంతంగౌడ్‌, కేశవరెడ్డి, శౌర్య, యాకూబ్‌, గోపాల్‌, బిక్కు, శివ, రమేశ్‌, చిన్న రవికుమార్‌, పూర్ణచందర్‌, గౌస్‌, అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

వర్ధన్నపేట: మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ పేర్కొన్నారు. ఇల్లంద గ్రామం నుంచి మండల పార్టీ అధ్యక్షుడు రాయపురపు కుమారస్వామి ఆధ్వర్యంలో పలువురు యువకులు హనుమకొండలోని అరూరి నివాసంలో సోమవారం భాజపాలో చేరారు. రాము, రాజు, అనిల్‌, కుమార్‌, మహేశ్‌, శ్రీనివాస్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కాశీబుగ్గ: వరంగల్‌ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ విజయం కోసం ఆ పార్టీ సీనియర్‌ నేత వరంగల్‌ అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 21వ డివిజన్‌ కాశీబుగ్గ తిలక్‌ రోడ్డులో కరపత్రాలు పంచారు. నాయకులు వెంకటరమణ, పరమేశ్వర్‌, హరిశంకర్‌, మురళీకృష్ణ, శ్రీనివాస్‌, భవానీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 శివనగర్‌: 35వ డివిజన్‌ శివనగర్‌ ప్రాంతానికి చెందిన భారాస, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలువురు సోమవారం సాయంత్రం భాజపా జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్‌ సమక్షంలో భాజపాలో చేరారు. వైట్ల గణేష్‌, సాయిరాం, సూరజ్‌ తదితరులు పాల్గొన్నారు.

25న ఉత్తరాఖండ్‌ సీఎం రాక

సుబేదారి: భాజపా వరంగల్‌ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ ఈ నెల 25న నామినేషన్‌ వేస్తారని, కార్యక్రమానికి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ దామి హాజరవుతారని పార్టీ హనుమకొండ, వరంగల్‌ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, గంట రవికుమార్‌ తెలిపారు. సోమవారం హంటర్‌రోడ్డులోని పార్టీ పార్లమెంటు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. వేయి స్తంభాల దేవాలయం నుంచి వరంగల్‌ కలెక్టరేట్‌ వరకు ర్యాలీ ఉంటుందన్నారు. అభ్యర్థి అరూరి రమేశ్‌ మాట్లాడుతూ.. నామినేషన్‌ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు తరలి రావాలని కోరారు. నాయకులు బన్న ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని