logo

నిప్పుల కుంపటి

జిల్లాలో ఎండలవేడి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఏప్రిల్‌ మొదటి వారం నుంచే ఎండలు తీవ్రమై రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.

Updated : 29 Apr 2024 05:43 IST

45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

గణపురం(భూపాలపల్లి రూరల్‌), న్యూస్‌టుడే: జిల్లాలో ఎండలవేడి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఏప్రిల్‌ మొదటి వారం నుంచే ఎండలు తీవ్రమై రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే.. జంకుతున్నారు.  మే నెలలో ఎండలు ఏస్థాయిలో ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం కొత్తపల్లి గోరి మండలంలో అత్యధికంగా 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, భూపాలపల్లి మండలంలో అత్యల్పంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో 12 మండలాలు ఉండగా,  ఎనిమిదిచోట్ల 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం భానుడి ప్రతాపం ఎంతలా ఉందో తెలుపుతోంది. గతేడాది ఇదే రోజున గరిష్ఠంగా చిట్యాల మండలంలో 36.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఈ ఏడాది మాత్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వాతావరణ శాఖ అధికారులు జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

జాగ్రత్తలు పాటించాల్సిందే: ఎండలో తిరిగి వేడిగా ఉన్న కాఫీలు, టీలు తాగకూడదు. ఆరుబయట పనిచేసే వారు చల్లని ప్రదేశంలో సేదతీరుతూ పనిచేసుకోవాలి. నిల్వపదార్థాలు భుజించరాదు.. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే రక్షణగా గొడుగు, టోపీ, రుమాలు తదితరాలను ముఖం, చెవులు కప్పి ఉంచేలా చుట్టుకొని వెళ్లాలి. పిల్లలు, వృద్ధులు ఎండలో ప్రయాణం చేయవద్దు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని