logo

కెప్టెన్‌ ఇంటి నుంచి ఖమ్మం ప్రచారానికి కేసీఆర్‌

వరంగల్‌లో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించి హంటర్‌రోడ్‌లోని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు నివాసంలో బస చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లారు

Updated : 30 Apr 2024 06:05 IST

 తొర్రూరులో ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌, చిత్రంలో మాజీ మంత్రి దయాకర్‌రావు
బాలసముద్రం, ఐనవోలు, వర్ధన్నపేట, రాయపర్తి, తొర్రూరు, మరిపెడ, న్యూస్‌టుడే: వరంగల్‌లో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించి హంటర్‌రోడ్‌లోని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు నివాసంలో బస చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు  ఉమ్మడి వరంగల్‌ జిల్లాల ముఖ్యనేతలెవరూ సోమవారం కెప్టెన్‌ నివాసం వద్దకు రాకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మం బయలుదేరిన కేసీఆర్‌కు అడుగడుగునా పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఐనవోలు మండలం పున్నేలు క్రాస్‌ వద్ద, వర్ధన్నపేట, రాయపర్తిలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కేసీఆర్‌ అక్కడ కొద్దిసేపు ఆగారు. జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఉస్మాన్‌ అలి, వైస్‌ ఎంపీపీ తంపుల మోహన్‌, నందనం సొసైటీ వైస్‌ ఛైర్మన్‌ చందర్‌రావు, కార్యకర్తలను  మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వారిని కేసీఆర్‌కు పరిచయం చేశారు.

తొర్రూరు బస్టాండ్‌ కూడలిలో భారాస శ్రేణులు కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికాయి. గిరిజన మహిళలు ప్రత్యేక వేషధారణతోపాటు డప్పుచప్పుళ్లు, డీజే మోతలతో నృత్యాలు చేశారు. బస్టాండ్‌ కూడలిలో కేసీˆఆర్‌ బస్సులో నుంచి మాట్లాడారు. స్వాగతం పలకడానికి వచ్చిన పార్టీ నాయకులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.  

 కేసీఆర్‌ బస్సుయాత్ర మరిపెడకు చేరుకోగానే నాయకులు, అభిమానులు రహదారికి రెండువైపులా నిల్చొని బస్సుపై పుష్పాలు చల్లుతూ స్వాగతం పలికారు. పార్టీ అభ్యర్థి కవిత, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ బస్సు ఎక్కి కేసీఆర్‌కు స్వాగతం పలికారు. బస్సులోపలి నుంచే అభిమానులకు కేసీఆర్‌ అభివాదం చేశారు. మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ గుడిపూడి నవీన్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని