logo

పారిజాత గిరి ప్రదక్షిణ

జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ పరిధిలో సోమవారం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయం కొండ చుట్టూ 2.50 కిలోమీటర్ల ప్రదక్షిణ చేసేలా ప్రత్యేకమార్గం ఏర్పాటుచేశారు.

Published : 01 Nov 2022 05:39 IST

ప్రదక్షిణను ప్రారంభిస్తున్న ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ జగపతిరాజు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ పరిధిలో సోమవారం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయం కొండ చుట్టూ 2.50 కిలోమీటర్ల ప్రదక్షిణ చేసేలా ప్రత్యేకమార్గం ఏర్పాటుచేశారు. దీన్ని ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ పేరిచర్ల జగపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పూజల్లో ఈవో మానికల రాంబాబు, అభివృద్ధి కమిటీ సభ్యులు, పురపాలక ఛైర్‌పర్సన్‌ బత్తిన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రధాన అర్చకుడు నల్లూరు రవికుమారాచార్యులు మాట్లాడుతూ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గిరి మార్గాన్ని సుమారు రూ.20 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేశారన్నారు. మంచిరోజు కావడంతో ప్రదక్షిణను ప్రయోగాత్మకంగా ప్రారంభించారని, రహదారిని మరింత అభివృద్ధి చేశాక మరోసారి పూర్తిస్థాయిలో చేపడతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని