logo

అసెంబ్లీ స్థానాలకు 12 నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల దాఖలు ప్రక్రియ జోరందుకుంది. సోమవారం నరసాపురం పార్లమెంటు స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానాలకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి

Published : 23 Apr 2024 05:59 IST

ఉండి: తెదేపా అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేస్తున్న రఘురామకృష్ణరాజు, చిత్రంలో ఎమ్మెల్యే రామరాజు
భీమవరం అర్బన్‌, ఉండి, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల దాఖలు ప్రక్రియ జోరందుకుంది. సోమవారం నరసాపురం పార్లమెంటు స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానాలకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి. నరసాపురం, ఉండి నియోజకవర్గాల నుంచి ముగ్గురు చొప్పున నామినేషన్లు వేశారు. భీమవరం, తణుకులలో రెండేసి, ఆచంట, పాలకొల్లు నుంచి ఒక్కో నామినేషన్‌ దాఖలయ్యాయి. ఇప్పటి వరకు పార్లమెంటు స్థానానికి ఏడుగురు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 37 మంది నామపత్రాలు దాఖలు చేసినట్లు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వెల్లడించారు. రి ఉండి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు కాళ్ల మండలం పెదఅమిరంలో తన నివాసం నుంచి ఎమ్మెల్యే రామరాజు, నరసాపురం లోక్‌సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ముఖ్య నాయకులతో కలిసి ఊరేగింపుగా ఉండి  ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. రెండు సెట్ల పత్రాలను రిటర్నింగ్‌ అధికారి సీవీ ప్రవీణ్‌ ఆదిత్యకు అందజేశారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు, భాజపా నియోజకవర్గ కన్వీనర్‌ కోరా రామ్మూర్తి, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని