logo

23వ స్థానంలో పశ్చిమ

పదో తరగతి ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది. గతేడాది 65.93 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 21వ స్థానంలో నిలిచింది

Published : 23 Apr 2024 06:13 IST

 

‘పది’ ఉత్తీర్ణత పెరిగినా వెనుకంజ

 

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పదో తరగతి ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది. గతేడాది 65.93 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 21వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఉత్తీర్ణత 81.82 శాతానికి పెరిగినా రాష్ట్ర స్థానంలో వెనుకబడింది.  బాలురతో పోలిస్తే బాలికల ఉత్తీర్ణత 5.9 శాతం మేర ఎక్కువగా నమోదైంది.

ప్రైవేటులో 96.68 శాతం

పది ఫలితాల్లో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 96.68 శాతం ఉత్తీర్ణతతో ముందంజలో ఉన్నారు. బీసీ, ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలల పరిధిలో వరుసగా 96.52, 94.44 శాతం చొప్పున ఉత్తీర్ణత నమోదైంది. మిగిలిన యాజమాన్యాల పాఠశాలల్లో ఇది 80 శాతం దాటలేదు. పలు పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఫలితాలపై ప్రభావం కనిపించింది. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణ ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయడం, ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని గంటల వ్యవధిలోనే ఇవ్వాలనే ఒత్తిళ్లతో కూడా ఆశించిన ఫలితాలు రాలేదనే వాదనలు ఉన్నాయి. తెలుగు, సైన్సు, గణితం, సాంఘికశాస్త్రంలలో ఫెయిల్‌ అయినవారు ఎక్కువగా ఉన్నారు.

రుసుముల చెల్లింపునకు 30 వరకు గడువు

మే 24 నుంచి జూన్‌ 3 వరకు పదోతరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారని డీఈవో ఆర్‌.వెంకటరమణ తెలిపారు. పరీక్ష రుసుమును ఈ నెల 30వ తేదీలోపు చెల్లించాలన్నారు. అపరాధ రుసుము రూ.50తో మే 1 నుంచి  23 వరకు అవకాశం ఉందన్నారు.

జనసేనాని పర్యటన వాయిదా

ఈనాడు, తాడేపల్లిగూడెం: జిల్లాలో సోమవారం జరగాల్సిన పవన్‌ కల్యాణ్‌ పర్యటన రద్దయింది.  కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఆయన హెలికాప్టర్లో తాడేపల్లిగూడెం రావాల్సి ఉంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో పవన్‌ పర్యటన రద్దు చేసుకున్నారు. సోమవారం తాడేపల్లిగూడెం, గణపవరంలో  నిర్వహించాల్సిన వారాహి విజయభేరీ సభలు వాయిదా పడ్డాయని, మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై త్వరలో ప్రకటిస్తామని తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌ తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని