logo

ఎన్నికల ఎర.. యువత విలవిల

రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 7,900 పోస్టులకు మాత్రమే డీఎసీˆ్స ప్రకటన ఇచ్చింది.. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎసీˆ్స పెడతానని చెబుతున్నా.. ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది.

Published : 23 Apr 2024 06:26 IST

ఉపాధ్యాయ  ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు?

ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగులు

 ఏలూరు అర్బన్‌, కుక్కునూరు, న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 7,900 పోస్టులకు మాత్రమే డీఎసీˆ్స ప్రకటన ఇచ్చింది.. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎసీˆ్స పెడతానని చెబుతున్నా.. ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. అందులో   ప్రతి మాటను నిలబెట్టుకోవాలి. అలా కాకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామాచేసి ఇంటికెెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి’’ అని విపక్షనేత హోదాలో యువతను ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలివి..

  •  చింతలపూడికి చెందిన లీలా మహేశ్‌ బీఎస్సీ, బీఈడీ చదివారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలనేది ఆయన ఆశయం. నిత్యం గ్రంథాలయానికి వెళ్లి పుస్తక పఠనం చేస్తూ ఐదేళ్లుగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు డీఎస్సీ-2024 ప్రకటించినప్పటికీ పలు కారణాలతో పరీక్షను వాయిదా వేయడంతో నిరాశ చెందారు.
  •  ముసునూరుకు చెందిన విఘ్నేశ్‌కు ఉపాధ్యాయ వృత్తి  చేపట్టాలనేది లక్ష్యం. ఇందుకోసం బీఏ, డీఈడీ పూర్తి చేశారు. సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందడం కోసం కఠోర సాధన చేస్తున్నారు. ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించినా ఎస్జీటీ కొలువుల సంఖ్య బాగా తగ్గిపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు.

  సమయం సరిపోకనే..

‘డీఎసీˆ్స పరీక్షల గడువు సరిపోకనే న్యాయస్థానాలను ఆశ్రయించారు. టెట్‌ పూర్తయ్యాక కనీసం 45 రోజుల వ్యవధి ఇచ్చిఉంటే సన్నద్ధతకు సరిపోయేది. అయిదేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసం డీఎస్సీ ఇచ్చాం అని చెప్పుకునేందుకు మాత్రమే ఆ ప్రకటన పనిచేసింది. చిత్తశుద్ధితో నిరుద్యోగులకు మేలు చేయాలనే తపన కనబడలేదు.’ అని కుక్కునూరు మండలం కొండపల్లికి చెందిన తోట ప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

మెగా డీఎస్సీ అన్నారు

గత ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించేందుకు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పిన మాటలకు.. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు పొంతన లేకుండా పోయింది. వైకాపా ప్రభుత్వంపై నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అని ప్రకటించడంతో ఉద్యోగాల కోసం ఉవ్విళ్లూరారు. గడిచిన అయిదేళ్లలో ఒక్క డీఎసీˆ్స నిర్వహించకపోవడంతో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా ప్రకటించడంతో కొందరు కోర్టును ఆశ్రయించారు.

వేలాది మంది భవిష్యత్తు ప్రశ్నార్ధకం

డీఎస్సీ-2018 తర్వాత డీఎస్సీ-2024 ప్రకటించారు. పరీక్షలు మాత్రం నిర్వహించలేదు. దీనికి ముందు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన టెట్‌ పరీక్షలకు దాదాపు 12 వేల మంది హాజరయ్యారు. వీరు కాకుండా గతంలో టెట్‌ పరీక్ష రాసి అర్హత పొందిన వారు అనేక మంది ఉన్నారు. ఇలా నూతన డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందడానికి వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ ద్వారా ఉమ్మడి జిల్లాలో కేవలం 228 కొలువులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడంతో వేలాది మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని