logo

వైకాపా నాయకులవి చిల్లర రాజకీయాలు

వైకాపా నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ.. మళ్లీ గద్దె నెక్కాలని చూస్తున్నారని.. ఈసారి ప్రజలెవరూ నమ్మరని ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ అన్నారు.

Published : 28 Apr 2024 04:44 IST

దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని   

పెదవేగి, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ.. మళ్లీ గద్దె నెక్కాలని చూస్తున్నారని.. ఈసారి ప్రజలెవరూ నమ్మరని ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. శనివారం పెదవేగి మండలం దుగ్గిరాలలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో దిగజారుడు రాజకీయాలతో గద్దెనెక్కారని, ఇప్పుడూ అదే విధంగా అధికారం దక్కించుకోవాలని  చూస్తున్నారన్నారు. వైకాపా నేతల ఆరోపణలకు మే 13న ప్రజలు తీర్పు చెబుతారని పేర్కొన్నారు. గతంలో దెందులూరు మండలం శ్రీరామవరంలో దళితులపై తాను వ్యాఖ్యలు చేసినట్లు అసత్య ప్రచారం చేశారని... అలాగే శుక్రవారం రాత్రి పెదవేగి మండలం లక్ష్మీపురంలో జరిగిన ఘటనలోనూ ఒక శాతమూ వాస్తవం లేదన్నారు. ఎన్నికల్లో ఎవరైనా ఓట్లడుగుతారు కానీ దాడి చేస్తారా.. ఇంకెన్నాళ్లు కట్టుకథలు చెబుతారని ప్రశ్నించారు.   ఉక్రోషాన్ని తట్టుకోలేకే దెందులూరు నియోజకవర్గ వైకాపా నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఏ ఒక్కరికీ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉత్పన్నమే కాదని.. అవసరమైతే ఆ గ్రామంలోనే నిజం నిరూపిస్తామని స్పష్టం చేశారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు వస్తున్న ప్రజాదరణను చూసి వైకాపా నాయకులకు దుర్బుద్ధి పుట్టిందన్నారు.  జనసేన నాయకుడు కొఠారు ఆదిశేషు, తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.దుగ్గిరాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న   ప్రభాకర్‌, జనసేన నాయకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని