logo

జగన్‌ పాలన... అభివృద్ధికి ఆమడ దూరాన

బద్వేలు పురపాలకలోని శివారు వార్డులు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి.

Published : 23 Apr 2024 05:14 IST

సమకూరని మౌలిక సదుపాయాలు

వల్లెలవారిపల్లెలో దళితవాడలో రహదారికి నోచని వీధి

న్యూస్‌టుడే, బద్వేలు, గోపవరం: బద్వేలు పురపాలకలోని శివారు వార్డులు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. ప్రజల నుంచి అన్ని రకాల పన్నులను వసూలు చేయడం తప్పితే మౌలిక వసతులు సమకూర్చలేదు. ఈ గ్రామాల్లో నివసించేవారంతా వ్యవసాయకూలీలే. వల్లెలవారిపల్లె ఎస్సీ కాలనీలో తాగునీటిని పట్టుకోవాలంటే అక్కడి కాలవల నుంచి వచే దుర్వాసన భరించలేకపోతున్నారు. రహదారులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనాల్లో వచ్చేవారు గుంతలు మిట్టలతో తరచూ ప్రమాదానికి గురవుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ప్రజలు నడిచే మార్గం అంతా బురదమయమై అల్లాడిపోతున్నారు. సిమెంటు రోడ్లు నిర్మించాలని అధికారులకు అనేకసార్లు విన్నవించినా పట్టించుకున్న పరిస్థితులు స్థానికంగా కనిపించడంలేదు. పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. దీంతో ప్రజల్లో వ్యాధుల భయం పెరిది.

వార్డు : 03        
జనాభా : 4,000
ఓటర్లు : 1611  
పురుషులు : 829
స్త్రీలు : 782
ప్రాంతాలు : వల్లెలవారిపల్లె, వల్లెలవారిపల్లె ఎస్సీ కాలని, ఎస్‌.రామాపురం, ఎస్‌.రామాపురం దళితవాడ


వీధుల్లో రహదారి లేదు

గ్రామంలో రహదారులు లేవు. వర్షం వచ్చిందంటే వీధుల్లో తిరగలేని పరిస్థితి. అధికారులకు పాలకులకు సమస్యలను విన్నవించాం. విని వెళ్లడమేకాని పరిష్కరించలేదు.

మేరీ, వల్లెలవారిపల్లె దళితవాడ


నీరు తెచ్చుకోవాలంటే కషం

మురుగు కాలువల్లోకి తాగునీటి కుళాయిలు పెట్టారు. నీరు తెచ్చుకోవాలంటే కష్టంగా ఉంది. వచ్చే నీరు కూడా వేళా లేకుండా వస్తోంది. వచ్చేనీరు కూడా సక్రమంగా రావడంలేదు.  

ఓబుళమ్మ, వల్లెలవారిపల్లె ఎస్సీ కాలనీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని