logo

అయిదేళ్ల వైకాపా పాలనలో... సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా విదల్చలేదు

అయిదేళ్ల వైకాపా పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా విదల్చలేదని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

Published : 23 Apr 2024 05:25 IST

భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి

పార్టీలో చేరిన వారితో భాజపా రాజంపేట భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

సంబేపల్లె, న్యూస్‌టుడే: అయిదేళ్ల వైకాపా పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా విదల్చలేదని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సంబేపల్లె మండలం నాగిరెడ్డి గారిపల్లె పంచాయతీ వట్టంవాండ్లపల్లెలో సోమవారం తెదేపా నేత గోపినాథరెడ్డి నివాసంలో తెదేపా రాయచోటి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డితో కలిసి ఎన్‌డీఏ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటి పురపాలక సంఘం పరిధిలో ఒక్క పక్కా భవనం కూడా కట్టలేదన్నారు. గత ప్రభుత్వంలో కట్టిన భవనాలను కార్యాలయాలుగా మార్చి వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో గృహనిర్మాణం, పింఛన్లలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. వెలిగల్లు, ఝరికోన, శ్రీనివాసపురం ప్రాజెక్టులకు అయిదేళ్లలో ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదన్నారు. వెలిగల్లు నుంచి రాయచోటికి అరకొరగా తాగునీరందిస్తున్నారన్నారు. జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని, రానున్న ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి విజయం ఖాయమన్నారు. అనంతరం ఎన్‌డీఏలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సమావేశంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు నరసారెడ్డి, మండల అధ్యక్షుడు చిన్నరెడ్డెయ్యయాదవ్‌, నాయకులు బాస్కర్‌రెడ్డి, రంగారెడ్డి, సుబ్బరాజుయాదవ్‌, ఖాదర్‌బాషా, కోటిరెడ్డి, బయ్యారెడ్డి, ఆలంసాహెబ్‌, బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని