logo

సమస్యలు అనేకం... ప్రభుత్వానిదే పాపం

Published : 24 Apr 2024 02:58 IST

కాలనీల్లో వేధిస్తున్న గుంతల దారులు
న్యూస్‌టుడే, జమ్మలమడుగు

నారాపుర వేంకటేశ్వర ఆలయం ఎదురుగా ధ్వంసమైన కల్వర్టు

డుగుకో గంత.. లీకేజీల కారణంగా జమ్మలమడుగు పట్టణంలోని మూడో వార్డు ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. సిమెంటు రోడ్డు తవ్వి మరమ్మతులు చేసిన తర్వాత సరిగా పూడ్చక పోవడంతో వీధులు గుంతలుగా మారాయి. రోడ్డుకు మధ్యలో ఉన్న ఇనుప విద్యుత్తు స్తంభం ప్రమాదకరంగా మారిందని సాయిరామ్‌ థియేటర్‌ వెనకాల మహబూబ్‌నగర్‌ వీధి ప్రజలు భయందోళనచెందుతున్నారు. కాలువలున్నా పూడిక తీయడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. ఎంపీడీవో కార్యాలయం రోడ్డు అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. నారాపుర వేంకటేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న కల్వర్టు ధ్వంసమైనా  అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.

ఓటర్లు : 2,007
పురుషులు : 949
స్త్రీలు : 1,058
ప్రాంతాలు : తేరు రోడ్డు, సాయిరామ్‌ థియేటర్‌ వెనక వీధి, ఎంపీడీవో కార్యాలయం రోడ్డు, మహబూబ్‌నగర్‌ వీధి


ప్రమాదకరంగా విద్యుత్తు స్తంభం
- రఫీ, జమ్మలమడుగు

మహబూబ్‌నగర్‌ వీధిలో ఇనుప విద్యుత్తు స్తంభం ప్రమాదకరంగా మారింది. వానా కాలంలో అపాయకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యుత్తు శాఖ అధికారులు స్పందించి ప్రత్యామ్నాయం చూపాలి. లీకేజీ కోసం తవ్విన గుంతలను పూడ్చితే మాకు ఇబ్బందులు తప్పుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని