logo

కడపలో చెడ్డీగ్యాంగ్‌ కలకలం

జిల్లాలో చెడ్డీ గ్యాంగ్‌ సంచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయిదు రోజుల కిందట కడప నగరంలోని ఓ శివారు ప్రాంతంలోని బహుళ అంతస్తు భవనంలోకి ఈ గ్యాంగ్‌ ప్రవేశించినట్లు సీసీ పుటేజీల ద్వారా తెలిసింది.

Published : 24 Apr 2024 03:20 IST

కడప, నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లాలో చెడ్డీ గ్యాంగ్‌ సంచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయిదు రోజుల కిందట కడప నగరంలోని ఓ శివారు ప్రాంతంలోని బహుళ అంతస్తు భవనంలోకి ఈ గ్యాంగ్‌ ప్రవేశించినట్లు సీసీ పుటేజీల ద్వారా తెలిసింది. తాజాగా సోమవారం రాత్రి వీరు సంచరించిన దృశ్యాలు ఆయా చోట్ల సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ గ్యాంగ్‌ పగటి వేళల్లో తాళాలు వేసి ఉన్న నివాసాల వద్ద రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను కట్టుదిట్టం చేశారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంట్లో విలువైన వెండి, బంగారు, నగదు ఉంచవద్దని సూచించారు. రాత్రి వేళల్లో ఎవరైనా నిక్కర్‌, బనియన్‌, ముఖం కనిపించకుండా మాస్క్‌ ధరించి ఉంటే వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని