logo

వంతెనకేదీ మోక్షం... జగన్‌ పాలనే సాక్ష్యం!

కడప - తాడిపత్రి జాతీయ రహదారిలో పాపఘ్ని నదిపై వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో రాకపోకలకు ఇక్కట్లు తప్పడం లేదు. 2021, నవంబరు 20న వరద ప్రవాహనికి ఇక్కడ పాత వంతెన కూలి పోయింది.

Published : 24 Apr 2024 03:26 IST

నిలిచిపోయిన వంతెన నిర్మాణ పనులు

కడప - తాడిపత్రి జాతీయ రహదారిలో పాపఘ్ని నదిపై వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో రాకపోకలకు ఇక్కట్లు తప్పడం లేదు. 2021, నవంబరు 20న వరద ప్రవాహనికి ఇక్కడ పాత వంతెన కూలి పోయింది. తాత్కాలికంగా రాకపోకల కోసం ఆ పక్కనే అప్రోచ్‌రోడ్డును ఏర్పాటు చేశారు. కొత్త వంతెన నిర్మాణానికి రూ.56 కోట్లు మంజూరు చేయడంతో గుత్తేదారు పనులు ప్రారంభించారు. మొత్తం 24 పిల్లర్లకు 20 వరకు పూర్తయ్యాయి. రోడ్డు పనులు 70 శాతం చేశారు. అయితే నదిలో నాలుగు పిల్లర్లు వేసిన ప్రాంతం అటవీశాఖ పరిధిలోకి రావడంతో కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోవాలని ఆ శాఖ అధికారులు అడ్డుకున్నారు. దీనిపై స్థానిక ఎంపీ, ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి పెట్టకపోవటంతో ఇప్పటికీ అనుమతి రాలేదు. సీఎం సొంత జిల్లాలో ఈ పరిస్థితి నెలకొన్నా ఎవరికీ పట్టడం లేదు. వచ్చే వర్షాకాలంలో నదిలో నీరు పెరిగితే అప్రోచ్‌ రోడ్డు మునిగి పోతుంది. దీంతో తాడిపత్రికి వెళ్లే వారు ఖాజీపేట నుంచి దాదాపు 23 కిలోమీటర్లు చుట్టిరావాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. వైకాపా పాలనలో వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.

ఈనాడు, కడప

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని