logo

‘విస్తరణలో సీనియర్లకే పెద్దపీట’

‘మా పార్టీ నుంచి ఎవరూ ఇతర పార్టీలలోకి వెళ్లరు. ఎన్నికలు చేరువైనప్పుడు ఏం జరుగుతుందనేది దేవునికి మాత్రమే తెలుసు’ అని కడూరు ఎమ్మెల్యే బెళ్లి ప్రకాశ్‌ వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల్లోంచి ఎవరైనా వచ్చి భాజపాలో చేరితే.. పాత, కొత్త అని అనుకోకుండా

Published : 28 Jan 2022 01:29 IST

ఎమ్మెల్యేల నుంచి వినతిపత్రం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: ‘మా పార్టీ నుంచి ఎవరూ ఇతర పార్టీలలోకి వెళ్లరు. ఎన్నికలు చేరువైనప్పుడు ఏం జరుగుతుందనేది దేవునికి మాత్రమే తెలుసు’ అని కడూరు ఎమ్మెల్యే బెళ్లి ప్రకాశ్‌ వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల్లోంచి ఎవరైనా వచ్చి భాజపాలో చేరితే.. పాత, కొత్త అని అనుకోకుండా కలిసి సాగాల్సిందేనన్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి స్వతంత్రంగా తీసుకునే నిర్ణయమని స్పష్టం చేశారు. ‘నేను మంత్రి పదవిని కోరుకోవడం లేదు. జిల్లాలో నా కన్నా సీనియర్లు ఉన్నారు. ఎవరికి ఇచ్చినా సంతోషమే’ అని పేర్కొన్నారు. చిక్కమగళూరుకు చెందిన ఎమ్మెల్యేలు సి.టి.రవి నేతృత్వంలో ముఖ్యమంత్రి బొమ్మైని గురువారం బెంగళూరులో కలుసుకున్నారు. తమ నియోజకవర్గాలకు నిధులు కేటాయించాలని వినతిపత్రాన్ని అందించారు. అనంతరం తనను కలుసుకున్న విలేకరులతో ప్రకాశ్‌ మాట్లాడారు. మూడిగెరె ఎమ్మెల్యే ఎం.పి.కుమారస్వామి, తరికెరె సురేశ్‌ వంటి సీనియర్లకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలన్నారు. మంత్రివర్గాన్ని విస్తరిస్తే మా జిల్లాకు మొండిచేయి చూపించే అవకాశం ఉందన్నారు. భాజపా సీనియరు నాయకుడు కె.ఎస్‌.ఈశ్వరప్పకు చిక్కమగళూరు జిల్లా బాధ్యతలు అప్పగించడం తమకు సంతోషంగా ఉందన్నారు. జిల్లాకు ప్రత్యేక పాల సమాఖ్య, మూడిగెరెలో ఉద్యానవన విశ్వ విద్యాలయం, భద్ర ఉప కనుమ పనులు, జిల్లాలో జలధార పథకాన్ని అమలు చేసే అంశాలపై సీఎంకు వినతిపత్రాన్ని అందించామని వెల్లడించారు. వచ్చే బడ్జెట్‌లో జిల్లాకు ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరామన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సి.టి.రవి, జీవరాజ్‌, ఎం.పి.కుమారస్వామి తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని