icon icon icon
icon icon icon

పవన్‌ బాబాయ్‌ని అసెంబ్లీకి పంపితే మరింత సేవ చేస్తారు: వరుణ్‌తేజ్‌

బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ను పిఠాపురం నుంచి అసెంబ్లీకి పంపితే మరింత సేవచేస్తారని సినీనటుడు వరుణ్‌తేజ్‌ అన్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా వరుణ్‌తేజ్‌ గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రోడ్‌షో నిర్వహించారు.

Updated : 28 Apr 2024 06:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ను పిఠాపురం నుంచి అసెంబ్లీకి పంపితే మరింత సేవచేస్తారని సినీనటుడు వరుణ్‌తేజ్‌ అన్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా వరుణ్‌తేజ్‌ గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రోడ్‌షో నిర్వహించారు. గాజు గ్లాసు గుర్తును చూపుతూ ఓట్లు అభ్యర్థించారు. తాటిపర్తి, కొడవలి, దుర్గాడ గ్రామాల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. ‘ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అప్పుచేసి మరీ పవన్‌ సాయం అందించారు. పిఠాపురం ప్రజలను కుటుంబసభ్యులుగా భావిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేస్తారు. చిరంజీవి సహా మా కుటుంబం మొత్తం పవన్‌ బాబాయ్‌ వెనకే ఉంది. కూటమి అభ్యర్థులను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు. వరుణ్‌తేజ్‌కు ప్రతి గ్రామంలో ఘన స్వాగతం లభించింది. తాటిపర్తిలో ఆయనకు మామిడిపండ్ల బుట్టను అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని