Tejashwi Yadav: ఎన్డీయేకు అయినా ఓటు వేయండి.. ఆయనకు వద్దు: తేజస్వీయాదవ్ వ్యాఖ్యలు
పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పప్పూయాదవ్‌ను ఉద్దేశించి ఆర్జేడీ తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) పరోక్షంగా విమర్శలు చేశారు.

పట్నా: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తమ అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం చేస్తోన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ మాజీ నేత, పూర్ణియా స్వతంత్ర అభ్యర్థి రాజేశ్‌రంజన్ అలియాస్ పప్పూయాదవ్‌ను ఉద్దేశించి స్పందించారు.
పూర్ణియాలో ఎన్నికల ప్రచారంలో తేజస్వి మాట్లాడుతూ.. ‘‘ఇది విపక్ష కూటమి (ఇండియా), ఏన్డీయేల మధ్య జరుగుతోన్న పోరు. ఇండియా బ్లాక్‌ను ఎంచుకోండి. కూటమి అభ్యర్థి భీమా భారతికి ఓటు వేయకపోతే.. ఎన్డీయేను ఎంచుకోండి. అర్థమైందా..?’’ అని అన్నారు. ఎవరి చేతుల్లోను మోసపోవద్దని ఓటర్లను హెచ్చరించారు. ఈ ఎన్నికలు ఒక వ్యక్తికి సంబంధించినవి కాదని, రెండు కూటముల సిద్ధాంతాలకు చెందినవని వెల్లడించారు. ఆయన మాటలకు కారణం పప్పూయాదవ్. ఒకప్పుడు ఆయన ఆర్జేడీ నేత. 2015లో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.
పూర్ణియా లోక్‌సభ స్థానంలో ఎన్డీయే నుంచి సిటింగ్ ఎంపీ సంతోశ్‌కుమార్ కుశ్వాహా, జేడీ(యు)ను వీడి గత నెలలో ఆర్జేడీలో చేరిన బీమా భారతి... విపక్ష ఇండియా కూటమి అభ్యర్థినిగా టికెట్ దక్కించుకున్నారు. వీరిద్దరిపై పప్పూయాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గత నెలలో తన నేతృత్వంలోని ‘జన్ అధికారి పార్టీ’ని ఆయన కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తనకు పూర్ణియా టికెట్ వస్తుందని ఆశించారు. ఇండియా కూటమి సర్దుబాటులో పూర్ణియా సీటు ఆర్జేడీకి వెళ్లడంతో భంగపడిన ఆయన.. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పోటీ నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు సూచించినా ససేమిరా అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
          
          
        
          
          తాజా వార్తలు
- 
                        
                            

కార్తిక మాసం రద్దీ.. ఆలయాల్లో భక్తుల భద్రతపై పవన్ కీలక ఆదేశాలు
 - 
                        
                            

పబ్లిక్‌లో వాళ్ల పేరు చెబితే నన్ను చంపేస్తారు: రష్మిక
 - 
                        
                            

అప్పలరాజు మాస్టారూ.. మీ కళాత్మక బోధనా శైలి చూడముచ్చటగా ఉంది: మంత్రి లోకేశ్
 - 
                        
                            

ఇద్దరు చిన్నారులను అనాథలను చేసిన రోడ్డు ప్రమాదం
 - 
                        
                            

అవమానాలు దాటి.. కూతుర్ని పంపి: నాన్న దిద్దిన ‘దీప్తి’..!
 - 
                        
                            

ఏఐకి సొంత తెలివి తెప్పించేందుకు ప్రయత్నించొద్దు.. మైక్రోసాఫ్ట్ AI చీఫ్ కీలక వ్యాఖ్యలు
 


