Andhra News: అల్లూరిపై ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించిన జస్టిస్‌ వెంకట శేషసాయి

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఈనెల 4న భీమవరంలో

Updated : 04 Jul 2022 00:18 IST

విజయవాడ: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఈనెల 4న భీమవరంలో ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రికి స్వాగతం పలుకుతూ అల్లూరిపై ముకుంద శర్మ రాసిన గీతాన్ని గజల్‌ శ్రీనివాస్‌ సంగీత సారథ్యంలో స్వీయగానం చేసి రూపొందించారు. ఈ ప్రత్యేక గీతాన్ని జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయి విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అల్లూరి జీవిత చరిత్ర దేశభక్తి స్ఫూర్తికి పాఠ్యాంశం వంటిదన్నారు. ఆ చంద్రతారార్కం వారి త్యాగాన్ని ప్రపంచం గుర్తు పెట్టుకుంటుందని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని