Ab Venkateshwar Rao: ఒకే కారణంతో రెండుసార్లు సస్పెండ్‌ చేశారు.. క్యాట్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ

కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై విచారణ జరిగింది.

Published : 29 Apr 2024 16:52 IST

అమరావతి: కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై విచారణ జరిగింది. తనను సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన క్యాట్‌లో పిటిషన్‌  దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఆదినారాయణ వాదనలు వినిపించారు. ఒకే కారణంతో ఏబీ వెంకటేశ్వరరావును రెండు సార్లు సస్పెండ్‌ చేశారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వాదించారు. మరోవైపు ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదిస్తూ.. అభియోపత్రం దాఖలు చేసి వాదనలు ముగిసే వరకు సస్పెండ్‌ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్‌.. తీర్పును వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని