Telangana News: త్వరలో జిల్లా ఆస్పత్రుల్లోనూ మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు: హరీశ్‌రావు

తెలంగాణలో త్వరలో జిల్లాల్లోనూ మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Published : 03 May 2022 16:21 IST

సిద్దిపేట: తెలంగాణలో త్వరలో జిల్లాల్లోనూ మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మోకీలు మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్న రోగులను హరీశ్‌రావు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మోకీలు మార్పిడి చికిత్సలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లోనే ఈ తరహా చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు. రూ.5 లక్షలు ఖర్చయ్యే ఈ శస్త్రచికిత్స త్వరలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సిద్దిపేటలో ప్రతి వారం ఇద్దరికి మోకీలు మార్పిడి ఆపరేషన్‌ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులపై రోగులకు నమ్మకం పెరిగిందని.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని హరీశ్‌రావు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని