AP 10th Results: రేపే ఏపీ టెన్త్‌ ఫలితాలు.. విడుదల చేయనున్న మంత్రి బొత్స

ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

Updated : 05 Jun 2022 14:54 IST

అమరావతి: ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్‌ దేవానంద్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత www.eenadu.netలో చూడొచ్చు.

తొలుత శనివారం ఉదయం 11 గంటలకే ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కానీ ఆ సమయం దాటిన తర్వాత ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు అర్ధంతరంగా ప్రకటించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. మంత్రి బొత్స, అధికారుల మధ్య సమన్వయలోపం.. సీఎం కార్యాలయ ఆదేశాలతో ఫలితాలు వాయిదా పడ్డాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని