రాజకీయ ప్రకటనల హోర్డింగులు వెంటనే తొలగించాలి: ముకేశ్‌కుమార్‌ మీనా

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ ప్రకటనల హోర్డింగులు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా ఆదేశించారు.

Published : 17 Mar 2024 11:29 IST

అమరావతి: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ ప్రకటనల హోర్డింగులు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్ర సచివాలయ పరిసరాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో దీన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోపు రాజకీయ ప్రకటనల కటౌట్లు తొలగించాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీ బృందాలు పర్యటించాలని ఆదేశించారు. ‘సీ విజిల్‌’ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని