Ganta Srinivasa Rao: గంటా శ్రీనివాసరావు పిటిషన్‌పై విచారణ వాయిదా

విశాఖ తూర్పు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.

Updated : 29 Jan 2024 12:19 IST

అమరావతి: విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. ఇటీవల స్పీకర్‌ గంటా రాజీనామాను ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగలేదని ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. కౌంటర్‌ దాఖలు చేయాలని స్పీకర్‌, న్యాయశాఖ కార్యదర్శికి, సీఈసీకి, ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసింది. 

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు లేఖ రాశారు. అప్పటి నుంచి ఈ అంశం పెండింగ్‌లో ఉండగా.. గత మంగళవారం స్పీకర్‌ ఆమోదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని