Chandrababu: అటవీ భూములు అన్యాక్రాంతం.. కేంద్రానికి చంద్రబాబు లేఖ

ఏపీలో అటవీభూమి అన్యాక్రాంతమవుతోందని  కేంద్రం జోక్యం చేసుకొని పర్యావరణపరంగా విలువైన భూమిని కాపాడాలంటూ కేంద్ర మంతి భూపేంద్ర యాదవ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

Updated : 15 Jul 2023 17:02 IST

అమరావతి: పశ్చిమగోదావరి (West Godavari) జిల్లా అల్లంచెర్లరాజుపాలెంలో అటవీ భూముల ఆక్రమణలపై కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌కు (Bhupendra Yadav) తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పర్యావరణపరంగా విలువైన అటవీ భూమి అన్యాక్రాంతమవుతోందని అందులో పేర్కొన్నారు. 1950 నుంచి దాదాపు 3,255 ఎకరాల భూమి అటవీశాఖ అధీనంలో ఉందని, కానీ, సంబంధిత శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు కొంత భూమిని సాగుభూమిగా ప్రకటించారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు అప్పట్లో తీసుకున్న నిర్ణయంపై కోర్టుల్లో వివాదం నడుస్తోందన్నారు. 

‘‘భూమి తమ అధీనంలో ఉందని ఆక్రమణదారులు, వారసులు కోర్టుకెక్కారు. యథాతథస్థితిని కొనసాగించాలని ఉత్తర్వులున్నా పనులు చేస్తు్న్నారు. విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసి, బోరు బావులు తవ్వుతున్నారు. అక్రమ రెవెన్యూ రికార్డులు సృష్టించే వారికి వైకాపా ప్రభుత్వం మద్దతిస్తోంది. కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని అటవీ భూములను కాపాడాలి. తక్షణమే సర్వే చేసి స్పష్టమైన సరిహద్దులు ఏర్పాటు చేయాలి. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రభుత్వం గట్టిగా పోరాడాలి. కబ్జాదారులతో కుమ్మక్కైన అధికారులపై చర్యలు తీసుకోవాలి.’’ అని చంద్రబాబు కేంద్ర మంత్రికి రాసిన లేఖలో కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని