Andhra news: డియర్‌ సీఎం సార్‌.. మీ ఎంపీ అనుచరుడు మోసం చేశాడు!

బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ (Nandigam Suresh) అనుచరుడు రేపల్లె సన్నీ తమని మోసం చేశారని గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఓ కుటుంబం ఫిర్యాదు చేసింది.

Updated : 11 Dec 2023 15:59 IST

గుంటూరు: బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ (Nandigam Suresh) అనుచరుడు రేపల్లె సన్నీ తమని మోసం చేశారని గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఓ కుటుంబం ఫిర్యాదు చేసింది. ఇసుక రీచ్ కాంట్రాక్ట్ వచ్చిందని నమ్మబలికి గుంటూరుకు చెందిన ముజిబుర్ రెహ్మాన్‌ కుటుంబం నుంచి రేపల్లె సన్నీ రూ.25 లక్షలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి చెల్లించాలని గత రెండేళ్లుగా అడుగుతున్నా..పట్టించుకోవటం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని రెహ్మాన్‌ మీడియా ఎదుట వాపోయారు. 

ఇదే విషయమై ఎంపీ నందిగం సురేశ్‌ను కూడా రెండుమూడు సార్లు కలిశామన్నారు. అయితే ఆ డబ్బులతో తనకు సంబంధం లేదని.. ఇంకోసారి వస్తే జైళ్లో పెట్టిస్తానని బెదిరించినట్లు రెహ్మాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తెలిసిన వ్యక్తి కావటంతో ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చామని రెహ్మాన్‌ తల్లి నజమున్నీసా వాపోయారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బ్యానర్‌ ప్రదర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని