కరోనా కట్టడికి గ్రామస్థుల వినూత్న ఆలోచన! 

రెండో దశ కరోనా విజృంభిస్తున్న వేళ..  వైరస్‌ కట్టడికి పల్లెవాసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో స్వీయ లాక్‌డౌన్ అమలవుతోంది. మరికొన్ని గ్రామాల్లో జనం గుమికూడకుండా చర్యలు చేపడుతున్నారు. చాటింపులు వేయిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.

Published : 18 Apr 2021 00:53 IST

వేములవాడ: రెండో దశ కరోనా విజృంభిస్తున్న వేళ..  వైరస్‌ కట్టడికి పల్లెవాసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో స్వీయ లాక్‌డౌన్ అమలవుతోంది. మరికొన్ని గ్రామాల్లో జనం గుమికూడకుండా చర్యలు చేపడుతున్నారు. చాటింపులు వేయిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వేములవాడ మండలం ఆరెపల్లిలో మహమ్మారి బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు శ్రమిస్తున్నారు.

గ్రామంలో ఇటీవలే కరోనా పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టిన స్థానికులు కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా గ్రామ కూడలిలోని సిమెంట్‌ బెంచీల్లో జనం కూర్చోకుండా వాటిని తలకిందులు చేశారు. గ్రామస్థులు లేదా వేరే ఊరివాళ్లు  ఒకచోట చేరకుండా అలా చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని