APలో కొనసాగుతున్న కర్ఫ్యూ

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా పగటి కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు సహా..

Updated : 05 May 2021 16:39 IST

అమరావతి: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు సహా పలు పట్టణాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఈనెల 18 వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లను అనుమతిస్తున్నారు. ఆ సమయంలోనూ 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.  ఆ తర్వాత దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రజా రవాణాతో పాటు ప్రైవేటు వాహనాలను నిలిపివేస్తున్నారు. అత్యవసర సర్వీసులతో పాటు టికెట్‌ ఉన్న ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నారు. 

ఆస్పత్రులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్‌లు, ఔషధ దుకాణాలతోపాటు కొన్ని అత్యవసర సేవలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. మినహాయింపునిచ్చిన అత్యవసర విభాగాలు, సేవల రంగాల్లో పనిచేస్తున్నవారు తప్ప... మిగతా వ్యక్తులెవరూ కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి వీల్లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సహా, వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ వ్యవసాయశాఖ జారీ చేసే కొవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించి నిర్వహించుకునేందుకు అనుమతిచ్చారు. తయారీ రంగానికి చెందిన పరిశ్రమలకూ మినహాయింపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని