Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Updated : 03 May 2024 00:36 IST

మేషం

ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి సమయం. ప్రారంభించిన పనులను బుద్ధిబలంతో చక్కగా పూర్తిచేయగలుగుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

వృషభం

శుభకాలం. అసాధారణ పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం. 

మిథునం

పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఒక వార్త మనఃశ్శాంతిని తగ్గిస్తుంది. శ్రీఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం.

కర్కాటకం

లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు అవసరం అవుతాయి. ఉద్యోగంలో మీ పై అధికారుల సహకారం ఉంటుంది. సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. వృత్తిపై మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

సింహం

ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.

కన్య

శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

తుల

ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శివనామాన్ని జపించాలి.

వృశ్చికం

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీ సర్దుకుంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.  

ధనుస్సు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రీలక్ష్మీ ధ్యానంతో మనోబలం పెరగడంతో పాటు శుభప్రదం.

మకరం

మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కీలక విషయాలను కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకుంటే మంచిది. కలహసూచన ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.

కుంభం

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.

మీనం

ప్రారంభించబోయే పనుల్లో అలసటకు గురవకుండా చూసుకోవాలి. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనఃపీడ ఉంది. మానసిక ప్రశాంతత కోసం శివ నామాన్ని జపించడం ఉత్తమం.

 ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని