NASA: ‘విండో సీట్‌’ నుంచి క్లిక్‌.. సింగిల్‌ ఫ్రేమ్‌లో అంతరిక్షం-భూమి!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న సమయంలో స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ ఎండ్యూరాన్స్‌ వ్యోమనౌకలోని కిటికీ నుంచి తీసిన అద్భుతమైన ఫొటో ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Published : 14 Sep 2023 20:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతరిక్షానికి సంబంధించిన ఎన్నో విశేషాలు, కీలక సమాచారాన్ని అమెరికా స్పేస్‌ ఏజెన్సీ (NASA) తెలియజేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా పంపించిన ఫొటోలను తన సామాజిక మాధ్యమ వేదికలో పోస్టు చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న సమయంలో స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ ఎండ్యూరాన్స్‌లోని కిటికీ నుంచి వ్యోమగాములు తీసిన అద్భుతమైన ఫొటో ఎంతగానో ఆకట్టుకుంటోంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) నలుగురు వ్యోమగాములతో స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ ఆగస్టు నెలలో బయలుదేరింది. ఐఎస్‌ఎస్‌కి చేరువైన సమయంలో వ్యోమనౌక కిటికీ నుంచి తీసిన చిత్రంలో భూమి అద్భుతంగా కనిపించింది. ఓవైపు అంతరిక్షం, మరో వైపు భూమి సింగిల్‌ ఫ్రేమ్‌లో కనిపించాయి. ఆఫ్రికా, ఐరోపా ఖండాలు, వాటి మధ్య నీలి రంగులో జిబ్రాల్టర్‌ జలసంధితో కూడిన మనోహరమైన దృశ్యం కెమెరాలో బంధించారు. దీన్ని ఇన్‌స్టాలో షేర్‌ చేసిన నాసా.. ‘విండో సీట్‌, ఎనీవన్‌?’ అంటూ కామెంట్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని