MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు

భారాస ఎమ్మెల్సీ కవిత నివాసంలో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు చేపట్టారు.

Updated : 15 Mar 2024 16:45 IST

హైదరాబాద్‌: భారాస (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) నివాసంలో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు చేపట్టింది. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు.. ఇంట్లోకి ఎవరినీ అనుమతించకుండా తనిఖీలు చేస్తున్నారు. దిల్లీ లిక్కర్‌ కేసుకు సంబంధించి ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ఇద్దరు మహిళా అధికారులు సహా 8మంది బృందం సోదాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. కవిత నివాసంలో ఉన్న అందరి వద్ద సెల్‌ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ అధికారులు వచ్చిన సమయంలో కవిత, ఆమె భర్త అనిల్‌ ఇంట్లోనే ఉన్నారు. సోదాల విషయం తెలుసుకొని కవిత నివాసానికి చేరుకొన్న భారాస లీగల్‌సెల్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ను అధికారులు అనుమతించలేదు. తనిఖీలు ముగిసిన తర్వాత ఆమెను కలవాలని ఈడీ అధికారులు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని