ఇటు మనిషి.. అటు సింహం.. ఆపై ఏమైంది?

ఇవతలి వైపు ఓ వ్యక్తి. అవతలి వైపు సింహం. మధ్యలో పెద్ద నీటి మడుగు. జనం ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. సింహం

Published : 14 Dec 2021 01:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇవతలి వైపు ఓ వ్యక్తి. అవతలి వైపు సింహం. మధ్యలో పెద్ద నీటి మడుగు. జనం ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. సింహం ఆ మనిషి దగ్గరకు వచ్చింది. చూసేవాళ్ల గుండె వేగం పెరుగుతోంది. ఇక... ఆ క్రూరమృగం మనిషిపై దాడి చేయడం ఖాయం అనుకున్నారంతా. కానీ, అతగాడి దగ్గరికి రాగానే సింహంలో స్పష్టమైన మార్పు. ఎవరూ ఊహించని విధంగా ఆ వ్యక్తిని ప్రేమతో ముద్దాడసాగింది. ఎందుకంటే ఏడేళ్ల కిందట ఆ సింహాన్ని కాపాడిన ప్రాణదాత అతను. క్రూర మృగాన్ని సైతం తన ప్రేమతో కట్టిపడేసిన ఆ వ్యక్తి ప్రఖ్యాత వన్యప్రాణి సంరక్షకుడు కెవిన్‌ రిచర్డ్‌సన్‌. ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అయింది. బాగా మచ్చిక చేసుకుంటే పులులు, సింహాలు మనుషులకు ఎలాంటి హాని చేయకుండా ఉండటం సహజమే.. కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా ఇలా జరగడం విచిత్రం అంటున్నారంతా. ఈ వీడియోకి కామెంట్లు పోటెత్తుతున్నాయి. ‘ఈ వీడియో చూసి నాకు కన్నీళ్లాగలేదు’ అని ఒకరంటే.. ‘ఈ బంధం అపురూపంగా ఉంది. పొద్దంతా చూస్తూనే ఉన్నాను’ అంటూ మరొకరు కామెంట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని