TS High Court: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసు విచారణ వాయిదా

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. 

Published : 12 Feb 2024 19:58 IST

హైదరాబాద్‌: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మరోసారి వాదనలు వినిపించనున్నారు. దీంతో విచారణను ఈ నెల 14వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. ఎమ్మెల్సీల నియామకాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ పరిధికి మించి వ్యవహరించి మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని తిరస్కరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించడంతో గవర్నర్ ఆమోదించారు. వీరిని ప్రతివాదులుగా చేర్చడంతో వాళ్ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ తరఫు న్యాయవాదులు మరోసారి పిటిషన్లపై వాదించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని