AP Schools: పాఠశాలల పునఃప్రారంభంపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఆదేశాలు జారీ

వేసవి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 11 Jun 2023 15:23 IST

అమరావతి: వేసవి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలుల దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. వేడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాఠశాలల ప్రారంభ తేదీని వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నప్పటికీ ఒంటి పూట బడుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ నెల 19వ తేదీ నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూలు ప్రకారం పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

ఎండలు మండుతున్నాయి.. సెలవులు పొడిగించండి: లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్న వేళ పాఠశాలలు పునఃప్రారంభించడం ఏంటని? తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. ఈ సమయంలో స్కూళ్లు తెరవడం అంటే విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడమేనన్నారు. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కనీసం వారం పాటు స్కూళ్లకు సెలవులు పొడిగించాలని డిమాండ్‌ చేశారు. తల్లిదండ్రుల అభిప్రాయం కూడా ఇదేనని.. దీనిపై తను సమాచారం తెప్పించుకుని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని లోకేశ్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని