Metro Rail: హైదరాబాద్‌ మెట్రో రైల్‌ మరింత స్పీడ్‌గా.. ప్రయాణికులకు సమయం ఆదా

హైదరాబాద్‌ మెట్రో రైళ్లు మరింత వేగంగా వెళ్లేందుకు కమిషనర్‌ ఆఫ్‌ మెట్రోరైల్వే సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్‌) అనుమతించినట్టు ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి వెల్లడించారు.

Updated : 02 Apr 2022 16:12 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైళ్లు మరింత వేగంగా వెళ్లేందుకు కమిషనర్‌ ఆఫ్‌ మెట్రోరైల్వే సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్‌) అనుమతించినట్టు ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి వెల్లడించారు. ఇప్పుడున్న వేగం కంటే మరో పది కిలోమీటర్లు వేగంగా వెళ్లేందుకు అనుమతి లభించింది. రైళ్ల వేగాన్ని గత నెల 28, 29 తేదీల్లో కమిషనర్‌ ఆఫ్‌ మెట్రోరైల్వే సేఫ్టీ ఉన్నతాధికారులు పరిశీలించారు. వేగం పెరగడంతో దూర ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం తగ్గనుంది. నాగోలు - రాయదుర్గం మధ్య 6 నిమిషాల ప్రయాణ సమయం, మియాపూర్‌ - ఎల్బీనగర్‌ మధ్య 4 నిమిషాలు, జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌ మధ్య 1.5 నిమిషాల ప్రయాణ సమయం ఆదా కానుంది. గతంలో 80 కిలోమీటర్ల వేగంతో మెట్రో రైలు వెళ్లేది. పెంచిన వేగంతో 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లనున్నట్టు అధికారులు ప్రకటించారు. కానీ, ప్రతి స్టేషన్‌ వద్ద ఆగడంతో ఈ వేగం సాధారణంగా కొంత వరకు తగ్గనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని