Justice Battu Devanand: పెద్ద నేరాల్లో ప్రముఖులుంటే.. కేసులు అంగుళం కదలవు: జస్టిస్‌ బట్టు దేవానంద్‌

దేశంలో 5 కోట్ల పెండింగ్‌ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోందని మద్రాసు హైకోర్టు జడ్జి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ అన్నారు.

Updated : 12 Aug 2023 13:23 IST

గుంటూరు: దేశంలో 5 కోట్ల పెండింగ్‌ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోందని మద్రాసు హైకోర్టు జడ్జి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ అన్నారు. గుంటూరులో ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్‌ బట్టు దేవానంద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Aadhaar: మీ ఆధార్‌ నంబర్‌తో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?

‘‘కేసుల విచారణ ఆలస్యం కావడం పెద్ద చర్చనీయాంశం. సామాన్యుల కేసులు ఏళ్లతరబడి విచారణ సాగుతున్నాయి. ప్రముఖులు, కార్పొరేట్ల కేసులు మాత్రం త్వరగా పరిష్కారమవుతున్నాయి. పెద్ద నేరాల్లో ప్రముఖులుంటే మాత్రం కేసులు అంగుళం కూడా కదలవు. కేసు విచారణ త్వరగా ముగిసేలా న్యాయవాదులు చొరవ చూపాలి. న్యాయవాదులు చొరవ చూపినప్పుడే బాధితులకు న్యాయం చేకూరుతుంది. బార్‌ కౌన్సిల్‌, కోర్టు బెంచ్‌ సమన్వయంతో కేసులు త్వరగా పరిష్కరించాలి’’ అని జస్టిస్‌ బట్టు దేవానంద్‌ కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని