TS High Court: సింగరేణి ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం కావాలి.. హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్

సింగరేణి ఎన్నికలను (SCCL union elections) ఈ నెల 27కు బదులు మార్చి నెలలో నిర్వహించాలంటూ తెలంగాణ హైకోర్టులో (TS HighCourt) పిటిషన్​ దాఖలైంది.

Published : 18 Dec 2023 13:40 IST

హైదరాబాద్: సింగరేణి ఎన్నికలను (SCCL union elections) ఈ నెల 27కు బదులు మార్చి నెలలో నిర్వహించాలంటూ తెలంగాణ హైకోర్టులో (TS HighCourt) పిటిషన్​ దాఖలైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నికల​ నిర్వహణకు ప్రభుత్వ న్యాయవాది ఉన్నత న్యాయస్థానాన్ని సమయం కోరారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పారని హైకోర్టు గుర్తుచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు విచారణను ఈ నెల 21కి హైకోర్టు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని