Kadem Project: నిండు కుండలా కడెం జలాశయం

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.

Updated : 07 Sep 2023 11:00 IST

కడెం: ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరదనీరు పోటెత్తుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 696 అడుగులకు చేరింది. జలాశయంలోకి 21,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 17,745 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది.

శ్రీరామ్‌ సాగర్‌కు వరద

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్‌ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 59,078 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. 16 గేట్ల ద్వారా 49,960 క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 3000 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 5000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని