KTR: దేశానికి లైఫ్‌సైన్సెస్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌: కేటీఆర్‌

సెమీ కండక్టర్ల రంగంలో హైదరాబాద్‌ నగరం అద్భుతంగా ముందుకెళ్తోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 03 Jul 2023 12:08 IST

హైదరాబాద్‌: సెమీ కండక్టర్ల రంగంలో హైదరాబాద్‌ నగరం అద్భుతంగా ముందుకెళ్తోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన యువత వల్ల నగరం అభివృద్ధి బాటలో నడుస్తోందని చెప్పారు. హైదరాబాద్‌ కోకాపేటలోని వన్‌ గోల్డెన్‌మైల్‌లో మైక్రోచిప్‌ టెక్నాలజీ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ కండక్టర్‌ డిజైన్‌, డెవలప్‌మెంట్‌ ఫెసిలిటీని కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

‘‘ నాస్కామ్‌ లెక్కల ప్రకారం దేశంలో 1/3 వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌ నుంచే ఉన్నాయి. బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్‌ ముందంజలో ఉంది. దేశానికి లైఫ్‌ సైన్సెస్‌ క్యాపిటల్‌గా నగరం ఉంది. భారత్‌లో వ్యాక్సిన్‌ ఉత్పత్తికి జీనోమ్‌ వ్యాలీ హెడ్‌క్వార్టర్స్‌. ప్రపంచంలోనే హైదరాబాద్‌ అతిపెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌’’ అని కేటీఆర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని