Hamsa Vahana seva: తిరుమలలో వైభవంగా శ్రీవారి హంసవాహన సేవ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా

Updated : 28 Sep 2022 21:17 IST

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం స్వామివారు హంస వాహనంపై విహరించారు. వీణ ధరించి శ్రీసరస్వతీ అలంకారంలో హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మాఢవీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రదర్శనలు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

హంసవాహన సేవలో శ్రీమలయప్పస్వామి జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. బ్రహ్మ వాహనమైన హంస.. జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని