AP High court: ‘సంక్రాంతికి మా ఊరు వెళ్తా.. రక్షణ కల్పించండి’: ఎంపీ రఘురామకృష్ణరాజు

సంక్రాంతికి తమ ఊరు వెళ్తానని.. రక్షణ కల్పించాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 11 Jan 2024 19:24 IST

అమరావతి: సంక్రాంతికి తమ ఊరు వెళ్తానని.. రక్షణ కల్పించాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు రఘురామపై 11 కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాదులు ఉమేష్‌ చంద్ర, వై.వి. రవిప్రసాద్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘‘గతంలో సీఐడీ అధికారులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారు. మరోసారి తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశముంది. పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వండి’’ అని కోర్టును అభ్యర్థించారు. ఆర్నేష్‌ కుమార్‌ కేసులో 41ఏ నిబంధనలు పాటించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

రఘురామకృష్ణరాజు పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. కేసు నమోదై, ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు అయితేనే 41ఏ నిబంధనలు వర్తిస్తాయన్నారు. తాజాగా ఆయనపై ఎలాంటి కేసులు పెట్టలేదని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని