Nagarjuna Sagar: సాగర్ ప్రాజెక్టుపైకి సీఆర్‌పీఎఫ్‌ బలగాలు

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (Nagarjuna Sagar) పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి.

Updated : 02 Dec 2023 14:24 IST

నాగార్జున సాగర్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (Nagarjuna Sagar) పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. ఈ నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు సాగర్‌ డ్యామ్‌ పైకి చేరుకుంటున్నాయి. ఇవాళ తెల్లవారుజాము 5 గంటల నుంచి ఒక్కో పాయింట్‌ను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకుంటున్నాయి. దీంతో డ్యామ్‌ పూర్తిగా కేంద్రం అధీనంలోకి వెళ్లనుంది. ఆ తర్వాత 13వ గేటు వద్ద కంచెను తొలగించే అవకాశం ఉంది. సీఆర్‌పీఎఫ్‌ బలగాల రాకతో తెలంగాణ పోలీసులు డ్యామ్‌ వద్ద నుంచి వెనుదిరిగారు. 

కేంద్ర బలగాల అధీనంలోకి సాగర్‌

సాగర్‌ నుంచి ఏపీ నీటి విడుదల, ఆ రాష్ట్ర పోలీసు బలగాల మోహరింపు నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, నీటిపారుదల శాఖ అధికారులతో ఆన్‌లైన్‌ ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించారు. గత నెల 29న ఏపీ ఏకపక్షంగా సాయుధ దళాలను మోహరించి సాగర్‌ కుడి కాలువ ద్వారా నీటి విడుదల చేయడంతో తలెత్తిన వివాదంపై భల్లా సమీక్షించారు. గత నెల 28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని ఆయన ఏపీని కోరారు. డ్యాం నిర్వహణ తాత్కాలికంగా సీఆర్‌పీఎఫ్‌ పర్యవేక్షణలో ఉంటుందని సూచించారు. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని