శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఎర వేసేందుకు ఓ బోనులో మేక మాంసం పెట్టారు. ఆదివారం ఎయిర్‌పోర్టు పరిసరాల్లోకి చిరుత రావడంతో రెండు రోజులుగా గాలింపు కొనసాగిస్తున్నారు.
ఆదివారం తెల్లవారుజామున ఎయిర్‌పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. అది రన్‌వేపైకి వస్తే ప్రమాదమని గుర్తించిన భద్రతాధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. రన్‌వే వైపు రాకుండా పహారా కాశారు. సీసీ కెమెరాల్లో పరిశీలించగా.. చిరుత ఆనవాళ్లు కనిపించాయి. అటవీశాఖ అధికారులను రప్పించారు. రన్‌వే, ప్యాసింజర్ టెర్మినల్ భవనం వైపు అది రాకుండా టపాసులు కాల్చారు. విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో వచ్చే శబ్దాలకు భయపడి బయటకు వెళ్లిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. గొల్లూర్ రిజర్వ్ ఫారెస్టు విమానాశ్రయానికి అతి సమీపంలో ఉండడంతో అక్కడి నుంచి అడవి జంతువులు ఎయిర్‌పోర్ట్‌లోకి చొరబడుతున్నాయని అటవీ అధికారులు తెలిపారు. 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రన్‌వే ప్రాంతంలో సగానికిపైగా ఖాళీగా ఉండడంతో చెట్లు ఏపుగా పెరిగి.. చిట్టడవిలా మారింది. చిరుత అటువైపు వెళ్లి ఉండవచ్చని.. విమానాశ్రయం సమీపంలోని ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వారణాసితో నా బంధం విడదీయలేనిది: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
-
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ‘మహా’తలపోటు
-
ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్.. అటు థ్రిల్
-
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 21,125
-
100 రోజులు.. 200 విమానాలు.. ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే!
-
ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ మెట్రో