rains: విజయవాడలో ఎడతెరిపిలేని వర్షం.. జలమయమైన రహదారులు

విజయవాడలో పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది.

Updated : 25 May 2024 14:26 IST

విజయవాడ: విజయవాడలో పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు జలమయమై.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బెంజి సర్కిల్‌, మొఘల్రాజపురం, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది.

మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బూదగవి చెరువు అలుగు పారుతోంది. విడపనకల్లు మండలంలో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలాయి. దీంతో 19 గ్రామాలకు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెంచులపాడు-పొలికి, పాల్తూరు-గోవిందవాడ గ్రామాల మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పొలాల్లో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని