Godavari: రాజమహేంద్రవరం, భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి వరద ఉద్ధృతి

తూ.గో జిల్లాలోని రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది.

Updated : 22 Jul 2023 11:05 IST

రాజమహేంద్రవరం: తూ.గో జిల్లాలోని రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరిన ప్రవాహం.. ఈ తెల్లవారుజాము నుంచి తగ్గుముఖం పట్టింది. ఆనకట్ట వద్ద ఉదయం 7 గంటలకు నీటిమట్టం 11.5 అడుగులకు చేరింది. 9.45 లక్షల క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ సాయంత్రానికి వరద మరింతగా తగ్గనుంది.

వరద కారణంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని బూరుగుల్లంక, జి.పెదపూడి లంక, అరిగలవారిపేట, ఊడిమూడి లంక తదితర లంక గ్రామాల్లో..  మర పడవల్లోనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఐ.పోలవరం మండలంలోని జి.మూలపాలెం, కాట్రేనికోన మండలం రామాయంపేట రేవులో వంతెన లేకపోవడంతో నాటుపడవల్లోనే స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు.  

మణిపుర్ ఘటన.. అదేరోజు 40 కి.మీ దూరంలో మరో ఘోరం..!

భద్రాచలం వద్ద నిలకడగా..

మరోవైపు భద్రాచలం వద్ద కూడా గోదావరి ఉద్ధృతి తగ్గుతోంది. శుక్రవారం ఉదయం నీటి మట్టం 43 అడుగుల కంటే తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు విరమించారు. ఉదయం 8 గంటల వరకు నీటిమట్టం 39.7 అడుగులకు చేరింది. ఇక్కడ గోదావరి వరద హెచ్చుతగ్గులు లేకుండా నిలకడగా ఉంది.

నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 34,588 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. నిజాంసాగర్‌  పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1,397.52 అడుగులుగా నమోదైంది. అలాగే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి 1,49,995 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1,079.10 అడుగులుగా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని