TS News: సాగర్‌లో ఏపీ అధికారుల అడ్డగింత

నాగార్జున సాగర్‌లో ఏపీ నీటి పారుదల శాఖ అధికారులను తెలంగాణ

Updated : 01 Jul 2021 15:03 IST

నాగార్జునసాగర్‌: నాగార్జున సాగర్‌లో ఏపీ నీటి పారుదల శాఖ అధికారులను తెలంగాణ పోలీసులు అనుమతించలేదు. సాగర్‌లో తెలంగాణ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన అధికారులను నూతన వంతెన వద్ద అడ్డుకొని వెనక్కి పంపారు. కృష్ణా బేసిన్‌లోని జలాశయాల్లో విద్యుదుత్పత్తి విషయంలో వివాదం నెలకొన్న వేళ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ జెన్‌కో అధికారులకు పులిచింతల ప్రాజెక్టు అధికారులు వినతి పత్రం అందించారు. పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేయాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్‌కి పులిచింతల ఎస్‌ఈ రమేశ్‌బాబు వినతిపత్రం అందజేశారు. ఈ ప్రాజెక్టు ప్రధానంగా డెల్టా నీటి అవసరాల కోసమేనని పులిచింతల అధికారులు తెలిపారు. కృష్ణా డెల్టాకు ప్రస్తుతం నీటి అవసరం లేదన్నారు. నీటిపారుదల శాఖ ఎస్ఈ నుంచి ఎలాంటి ఇండెంట్‌ లేనందువల్ల నీటి విడుదల ఆపాలని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని