TTD: నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల శ్రీవారి ‘ధన ప్రసాదం’ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హుండీలో వేసిన నాణేలను భక్తులకు ధన ప్రసాదంగా..

Updated : 01 Sep 2021 19:16 IST

తిరుమల: తిరుమల శ్రీవారి ‘ధన ప్రసాదం’ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హుండీలో వేసిన నాణేలను భక్తులకు ధన ప్రసాదంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. గదుల కోసం డిపాజిట్‌ చేసిన నగదును ధన ప్రసాదం పేరుతో చిల్లర రూపంలో భక్తులకు ఇవ్వనుంది. తితిదే వద్ద పెద్ద మొత్తంలో చిల్లర నాణేలు పేరుకుపోతుండటం, హుండీ నాణేలను డిపాజిట్‌ చేసుకునేందుకు బ్యాంకులు సైతం ముందుకు రావడం లేదు. దీంతో చిల్లర నాణేల నిల్వను తగ్గించేందుకు తితిదే ఈ నూతన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని