Disha case: దిశ కేసులో కీలక పరిణామం.. వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న విచారణాధికారి

దిశ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా పనిచేసిన సురేంద్ర స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకున్నారు.

Updated : 28 Aug 2023 12:55 IST

హైదరాబాద్: దిశ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా పనిచేసిన సురేంద్ర స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకున్నారు. ఈమేరకు డీజీపీ అంజనీ కుమార్‌కు వీఆర్‌ఎస్‌ దరఖాస్తును సమర్పించారు. ఇటీవల తరచుగా జరుగుతున్న బదిలీలపై అసంతృప్తి కారణంగానే సురేంద్ర వీఆర్‌ఎస్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Train Accident: కాలిన కోచ్‌లో భారీగా నోట్లకట్టలు

ప్రస్తుతం సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగానికి సురేంద్ర బదిలీ అయ్యారు. అంతకుముందు ట్రాన్స్‌కో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీగా ఆయన పని చేశారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ సమయంలో షాద్‌నగర్‌ ఏసీపీగా సురేంద్ర ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని