Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 31 May 2024 09:09 IST

1. మద్యం పార్టీలో ఎస్సై.. సోషల్‌ మీడియాలో వీడియో హల్‌చల్‌

మద్యం పార్టీలో ఓ ఎస్‌.ఐ. పాల్గొన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో గురువారం హల్‌చల్‌ చేసింది. టేబుళ్లపై రెండు మందు గ్లాసులు కనిపిస్తుండగా.. యూనిఫాంలో ఎస్‌.ఐ తాపీగా సిగరెట్‌ తాగుతున్నారు. ఈ వీడియోలో ఉన్న ఎస్‌.ఐ ఎంవీవీ రవీంద్రబాబు గతంలో విజయవాడ భవానీపురం స్టేషన్‌లో పనిచేశారు. ఏడు నెలల క్రితం బదిలీపై కాకినాడ గ్రామీణ నియోజకవర్గం తిమ్మాపురం పోలీసుస్టేషన్‌కు వచ్చారు. పూర్తి కథనం

2. రూ.10తో పరేషాన్‌!.. మార్కెట్లో తగ్గిన నోటు చలామణి

విపణిలో రూ.10 నోటు చలామణి తగ్గింది. వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. దశాబ్దాల క్రితం సాధారణ కొనుగోలుకు 5, 10, 20, 25, 50 పైసల నాణేలు చలామణిలో ఉండేవి. కాలక్రమేణా అవి కనుమరుగై రూపాయి ప్రామాణికంగా చలామణిలోకి వచ్చింది. క్రమంగా ధరల పెరుగుదల కారణంగా రూ.1, 2, 5ల నాణేలు ఉన్నా కొంతకాలంగా రూ.5లు, రూ.10లు ప్రామాణికంగా నడుస్తోంది.పూర్తి కథనం

3. నగరవాసులు ఏమైపోతే మాకేం!

ఇప్పుడు రాష్ట్రంలోని నగరపాలక సంస్థల కమిషనర్లలో చాలామంది క్షేత్ర స్థాయికి వెళ్లడమే మరిచిపోయారు. ఎన్నికల ముందు వరకు అధికార పార్టీ నేతల సేవకే పరిమితమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన పనులకే ప్రాధాన్యమిచ్చారు. కొందరైతే అక్రమార్జనే ధ్యేయమన్నట్లుగా పని చేస్తున్నారు. నగరపాలక అధికారులు, ఉద్యోగులతో కలిసి ఉదయం 6 గంటలకే వీధుల్లో ప్రత్యక్షమయ్యే కమిషనర్లు అరుదుగా కనిపిస్తున్నారు. పూర్తి కథనం

4. తనిఖీలు.. నామ‘మాత్ర’మే!

అనారోగ్యంతో ఎవరైనా ఆసుపత్రికి వెళితే ప్రైవేటు వైద్యులు ఎడాపెడా మందులు రాస్తుంటారు. ఆ మందులు సైతం ఆసుపత్రిలో ఉండే మందుల దుకాణం(ఫార్మసీ)లోనే తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న మందులు అయిపోగానే అదే దుకాణానికి వెళ్లాల్సి ఉంటుంది. మిగతా ఏ దుకాణాల్లో ఇవి లభించవు. గిరిజన జిల్లాలో ఇష్టానుసారంగా ధరలను పెంచి మాత్రల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.పూర్తి కథనం

5. పంతాలు మాని ఫ్యాక్షన్‌ వీడిన పల్లెలు

అయిదారు దశాబ్దాల క్రితం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాయకుల మధ్య విపరీతమైన ఆధిపత్య పోరు నడిచేది. ఈ క్రమంలో నెలకొన్న ఫ్యాక్షన్‌ రాజకీయాలతో కొన్ని గ్రామాల్లో ఎప్పుడేం జరుగుతుందోనని జనం భయపడేవారు. ఆ ఊళ్లలో నోరెత్తే ధైర్యం కూడా ఎవరికీ ఉండేది కాదు. ఉమ్మడి జిల్లాలోని సంతమాగులూరు, అద్దంకి, మార్టూరు, పంగులూరు మండలాలు ఈ తరహా పరిస్థితులతో అట్టుకుడిపోయాయి.పూర్తి కథనం

6. తెలంగాణపై ప్రేముంటే తెరాస పేరెందుకు మార్చారు?

తెలంగాణపైన, తెలంగాణ ప్రజలపైన ప్రేముంటే తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి(భారాస)గా ఎందుకు మార్చారో చెప్పాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు. చార్మినార్, కాకతీయ తోరణంపైన కాంగ్రెస్‌కు ఎనలేని గౌరవముందని, పల్లకి ఎక్కిన వారే కాదు... దాన్ని మోసిన వారి చరిత్ర కూడా భావితరాలకు తెలియ చేయాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నమని గురువారం ఆయనొక ప్రకటనలో స్పష్టంచేశారు.పూర్తి కథనం

7. అనుచరులు విహారాలకు.. కార్యకర్తలు జైళ్లకు

జెండా మోసినందుకు తమను జైళ్లకు పంపిస్తారా? అనుచరులను కాపాడుకుని వేసవి విడిది కేంద్రాలకు పంపుతారా? అంటూ కార్యకర్తలు రగిలిపోతున్నారు. పోలింగ్‌ రోజు, మరుసటి రోజు జరిగిన దాడుల్లో కేవలం కార్యకర్తలే జైళ్లకు వెళ్లడం.. వారిని బెయిల్‌పై నుంచి తెచ్చే ప్రయత్నాలూ నేతలు చేయకపోవడంతో ఇంతకాలం పార్టీ కోసం కష్టపడితే దక్కే ప్రతిఫలం ఇదా? అంటూ బాధపడుతున్నారు.పూర్తి కథనం

8. సామాజిక మాధ్యమాలపై పోలీసు కన్ను

స్వేచ్ఛా వాతావరణం ఉందని ప్రతిఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో తెగ ప్రచారం చేస్తుంటారు.. కావాల్సిన వారిని పొగుడుతూ.. గిట్టని వారిని ద్వేషిస్తూ పోస్ట్‌ల మీద పోస్టులు పెడుతుంటారు.. ఇక నుంచి అలా చేస్తే పోలీసులు మీ ఇంటికి వస్తారు.. సోషల్‌ మీడియాలో తొందరపడి పోస్టులు చేయొద్దు. అంతర్జాలం ఉంది కదా.. అని తెగ వైరల్‌ చేస్తే జైలు కెళతారు. పూర్తి కథనం

9. తరచూ ఎన్నికలు దేశానికి మంచిది కాదు

తరచూ ఎన్నికలు నిర్వహిస్తుండటం దేశానికి అంత మంచిదికాదని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం అభిప్రాయపడ్డారు. వచ్చే అయిదేళ్లలో ‘ఒకే దేశం, ఏక కాల ఎన్నికలు’ వ్యవస్థను అమలు పరచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా భావిస్తున్నట్లు రాజ్‌నాథ్‌ తెలిపారు. పూర్తి కథనం

10. తమిళనాడులో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి?

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తమిళనాడులో సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్‌పై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడి నరసరావుపేటకు చేరుకున్న విషయం తెలిసిందే. ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి పరారీలో ఉండటం అనుమానాలకు తావిస్తోంది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని