Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top ten News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 Jun 2023 13:11 IST

1. భారీ కాన్వాయ్‌తో.. మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన కేసీఆర్‌

భారాస అధినేత, తెలంగాణ సీఎం కే సీఆర్‌ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో సీఎం పర్యటన కొనసాగనుంది. సోలాపుర్‌, దారాశివ్‌ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ప్రగతిభవన్‌ వద్ద నుంచి రెండు బస్సులు, సుమారు 600 కార్లతో భారీ కాన్వాయ్‌ మహారాష్ట్రకు బయల్దేరింది. కేసీఆర్‌, మరికొందరు ముఖ్యనేతలు బస్సులో ప్రయాణిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణలో ₹3,500 కోట్ల పెట్టుబడులు: లులూ గ్రూప్‌ ఛైర్మన్‌

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు లులూ గ్రూప్‌ ఛైర్మన్‌ యూసఫ్‌ అలీ వెల్లడించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎక్స్‌పోర్ట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో పెట్టుబడుల కార్యాచరణను ప్రకటించారు. ఇప్పటికే రూ.300 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో షాపింగ్‌ మాల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మేకిన్‌ ఇండియాకు మద్దతిస్తాం: బోయింగ్‌ సీఈవో కల్హౌన్‌

ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమానికి తమ కంపెనీ మద్దతు ఇస్తుందని బోయింగ్‌(Boeing) సీఈవో డేవిడ్‌ ఎల్‌ కల్హౌన్‌ పేర్కొన్నారు. భారత్‌లో వాణిజ్య వైమానిక రంగం విస్తరణలో కీలక పాత్ర పోషిస్తామని వెల్లడించారు. ‘‘వేగంగా విస్తరిస్తున్న భారత వైమానిక వాణిజ్య మార్కెట్‌, వాయుసేన యుద్ధ సన్నద్ధత, ఆధునికీకరణలో కీలక పాత్ర పోషించడాన్ని బోయింగ్‌ గర్వకారణంగా భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ముంబయికి భారీ వర్ష సూచన.. హిమాచల్‌లో చిక్కుకుపోయిన 200 మంది పర్యాటకులు!

నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) విస్తరణతో ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) మండీ జిల్లాలోని బాగీపుల్‌ ప్రాంతంలో ఆకస్మిక వరదల్లో దాదాపు 200 మందికిపైగా పర్యాటకులు, స్థానికులు చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు.. కుల్లు- మండీ జాతీయ రహదారి (NH- 3)పై అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు.. తెలియకుండానే వెళ్లిపోయిన రైలు

రైళ్ల వేళల్లో మార్పులు జరిగినప్పుడు.. రైళ్లు ఆలస్యం/రద్దయినప్పుడు రైల్వే (Railway) సిబ్బంది ఆ వివరాలను ప్రయాణికులకు ఎప్పటికప్పుడు స్టేషన్‌లో అనౌన్స్‌ చేస్తారు. కానీ, కర్ణాటక (Karnataka)లోని కలబురగి రైల్వే స్టేషన్‌ (Kalaburagi station)లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ రైలు షెడ్యూల్‌లో జరిగిన మార్పును అక్కడి సిబ్బంది ప్రయాణికులకు అనౌన్స్‌మెంట్‌ (Announcement) చేయడం మర్చిపోయారు. దీంతో ప్రయాణికులు ఎక్కాల్సిన రైలును మిస్‌ అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విమానం అత్యవసర ల్యాండింగ్.. మళ్లీ టేకాఫ్‌ చేయనన్న పైలట్‌

దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సంస్థకు చెందిన విమానం ఒకటి అత్యవసరంగా జైపుర్‌ (Jaipur)లో దిగింది. అయితే దాన్ని మళ్లీ టేకాఫ్‌ చేసేందుకు పైలట్‌ (Pilot) ససేమిరా అనడంతో కొన్ని గంటల పాటు నిలిచిపోయింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దేశంలో ఏం జరుగుతోంది..? దిల్లీలో విమానం దిగినవెంటనే మోదీ ఆరా

అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ(PM Modi) అర్ధరాత్రి తర్వాత భారత్‌ చేరుకున్నారు. దిల్లీలో విమానం దిగిన వెంటనే పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) చేసిన ట్వీట్‌కు సమాధానం ఇచ్చారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda), పార్టీ నేతలు హర్షవర్ధన్‌, గౌతం గంభీర్‌ తదితరులు విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పుతిన్‌పై తిరుగుబాటు సమయంలో.. వైట్‌హౌస్‌లో బైడెన్‌ ఇలా..!

రష్యాలో ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ తిరుగుబాటు చేసిన సమయంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ అప్రమత్తమైపోయారు. వాస్తవానికి అమెరికా వద్ద వాగ్నర్‌ ప్లాన్లపై ముందే సమాచారం ఉంది. దీంతో పరిణామాలు తీవ్రమయ్యే కొద్దీ అమెరికా ముందు జాగ్రత్తలు తీసుకొంటూ వెళ్లింది. ముఖ్యంగా తన మృత్యువు కోసం పశ్చిమ దేశాలు ఎదురు చూస్తున్నాయని పుతిన్‌ చేసే ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని బైడెన్‌ కార్యవర్గం భావించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 74 మిలియన్‌ డాలర్ల సాయం.. ఉక్రెయిన్‌కు ఆస్ట్రేలియా కొత్త ప్యాకేజీ

రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఆస్ట్రేలియా (Australia) ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్‌ (Anthony Albanese) కీలక ప్రకటన చేశారు. 74 మిలియన్‌ డాలర్ల సహాయాన్ని ఉక్రెయిన్‌ (Ukraine)కు అందిస్తామని సోమవారం వెల్లడించారు. ఈ కొత్త ప్యాకేజీ (new package) ద్వారా 70 సైనిక వాహనాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం అందించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇక రోడ్డెక్కబోమన్న రెజ్లర్లు.. సోషల్‌ మీడియా నుంచీ బ్రేక్

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI)లో క్రీడాకారిణులపై లైంగిక వేధింపులను నిరసిస్తూ దేశంలో అగ్రశ్రేణి కుస్తీ యోధులు రోడ్డెక్కిన ఘటన చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సమాఖ్య అధ్యక్షుడిగా పనిచేసిన బ్రిజ్‌ భూషణ్‌(Brij Bhushan Singh)పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేసిన రెజ్లర్లు(Wrestlers).. కేంద్రం హామీలతో ఆ నిరసనకు విరామం ఇచ్చారు. ఈ క్రమంలో వారు ట్విటర్ వేదికగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని