Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Jul 2023 16:59 IST

1. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం.. ఉన్నతస్థాయి కమిటీ విచారణ

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (Falaknuma Express) ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. హైదరాబాద్‌లోని రైల్వే సంచాలన్‌ భవన్‌లో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది నుంచి వివరాలను సేకరిస్తోంది. ప్రమాదంపై రైల్వే అధికారులు రెండు రోజులపాటు వివరాలు సేకరించనున్నారు. ప్రమాదమా?కుట్రా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘ఫెయిల్యూర్‌ ఆధారిత విధానం’లో చంద్రయాన్‌-3

చంద్రుడిపై అన్వేషణలో భాగంగా ISRO చేపట్టిన చంద్రయాన్‌ 3 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. జులై 14 మధ్యాహ్నం 2.35కి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. తాజాగా వీటికి సంబంధించిన తాజా సమాచారాన్ని అందించిన ఇస్రో.. చంద్రయాన్‌ 2తో పోలిస్తే చంద్రయాన్‌-3ని ఫెయిల్యూర్‌ ఆధారిత విధానంతో అభివృద్ధి చేశామని తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దిల్లీకి వరద ముప్పుపై కేజ్రీవాల్‌ ఏమన్నారంటే..?

దిల్లీ (Delhi)ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు యమునా నది (Yamuna River) ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే వార్నింగ్‌ మార్క్‌ (Warning mark)ను దాటిన నది నీటిమట్టం.. ప్రమాదకర స్థాయికి చేరువైంది. ఈ నేపథ్యంలోనే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అత్యవసర సమావేశం నిర్వహించారు. వర్షాలపై అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పవన్‌ కల్యాణ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు (Pawan Kalyan) రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఏపీలో మహిళలు కనిపించకుండా పోతున్నారంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌ స్పందించింది. పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. ఏ కేంద్ర నిఘా వ్యవస్థ చెప్పిందో సమాచారం ఇవ్వాలని కోరింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పెండింగ్‌ బిల్లుల అంశంపై తెలంగాణ రాజ్‌భవన్‌ క్లారిటీ

పెండింగ్‌ బిల్లుల అంశంపై రాజ్‌భవన్‌ వివరణ ఇచ్చింది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవని స్పష్టం చేసింది. గతంలోనే 3 బిల్లులను గవర్నర్‌ ఆమోదించారని వెల్లడించింది. మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారని పేర్కొంది. మిగిలిన బిల్లులపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మణిపుర్‌లో పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత వారిదే: సుప్రీం

మణిపుర్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న హింస (Manipur Violence) పూర్తిస్థాయిలో అదుపులోకి రావడం లేదు. దీనిపై భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. మణిపుర్‌లో ఉద్రిక్తతలను మరింత పెంచేందుకు సుప్రీం కోర్టు వేదిక కాకూడదని.. అక్కడ హింసను అరికట్టేందుకు శాంతి భద్రతల యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేమని పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రాజ్యసభ ఎన్నికలు.. కేంద్రమంత్రి జైశంకర్‌ నామినేషన్‌

రాజ్యసభ(Rajya Sabha) నుంచి జులై, ఆగస్టు నెలల్లో రిటైరవుతున్న 10 మంది స్థానంలో కొత్త సభ్యులను ఎన్నుకునేందుకు జులై 24న ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. రాజ్యసభ ఎన్నికలు(Rajya Sabha Polls) వేళ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌(S.Jaishankar) గుజరాత్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. గాంధీనగర్‌లోని అసెంబ్లీ కాంప్లెక్స్‌లో తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారిణి రీటా మెహతాకు సమర్పించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత మార్కెట్లోకి హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌

హ్యుందాయ్‌ మోటార్స్ ఇండియా లిమిటెడ్‌ భారత మార్కెట్లోకి ఓ సరికొత్త మైక్రో ఎస్‌యూవీ ఎక్స్‌టర్‌ (Hyundai Exter)ని విడుదల చేసింది. దీని బేస్‌ వేరియంట్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.5,99,900 కాగా.. టాప్‌ వేరియంట్‌ ధర రూ.9,31,990గా నిర్ణయించారు. గ్రాండ్‌ ఐ10 నియోస్‌ను నిర్మించిన కె1 ప్లాట్‌ఫామ్‌ పైనే దీనిని తయారు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తిరుగుబాటు తర్వాత ప్రిగోజిన్‌తో పుతిన్‌ భేటీ..!

రష్యా (Russia)పై తిరుగుబాటు (mutiny) ప్రయత్నం చేసిన తర్వాత వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ (Prigozhin )తో అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) స్వయంగా భేటీ అయ్యారట. ఈ విషయాన్ని క్రెమ్లిన్‌ (Kremlin) అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ సోమవారం వెల్లడించారు. జూన్‌ 29న జరిగిన ఈ భేటీలో ప్రిగోజిన్‌తో పాటు వాగ్నర్‌ గ్రూప్‌ కమాండర్లు కూడా పాల్గొన్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దిల్లీ ఆర్డినెన్స్‌ వ్యవహారం.. కేంద్రానికి ‘సుప్రీం’ నోటీసులు

దిల్లీ (Delhi)లో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం సాగుతోన్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ (Ordinance) రాజ్యాంగ బద్ధతను సవాల్‌ చేస్తూ దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ పిటిషన్‌పై తమ వైఖరిని తెలపాలని కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని